తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులై 7 జూలూరుపాడు మండలంలోని బేతాలపాడు గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ సమస్యలపై అసహనం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుండి రాత్రిపూట తరచూ విద్యుత్ కటింగ్ జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా వర్షాకాలం వచ్చినందున , దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదని నరసాపురం సబ్ స్టేషన్ నుండి విద్యుత్ నిరంతరం కోతకు గురవుతుందని సంబంధిత లైన్మెన్ లకు ఎన్నిసార్లు ఫోన్లో చేసిన స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమారు 100 మంది ప్రజలు మరియు రైతులు జూలూరుపాడు మండల సబ్ స్టేషన్ ప్రధాన గేటు ను మూసి గేటు ముందు ధర్నా దిగారు. ఈ ధర్నాకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే నాలుగైదు రోజుల్లో డి ఈ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ