తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికను పారదర్శకంగా జరుగుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు అన్నారు. పినపాక నియోజకవర్గం మణుగూరులో డీసీసీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఐసిసి అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం, డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీపీసీసీ అబ్సర్వర్స్ ఈడ్పుగంటి సుబ్బారావు, సాగరిక, సంజీవ్ ముదిరాజ్, కోఆర్డినేటర్ కె నాగేందర్ రెడ్డి లతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని సాధారణ ప్రజలతో పాటు మేధావుల ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తామని, జిల్లా అధ్యక్ష ఎంపికపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, పైరవీలకు తావు లేకుండా ఎన్నిక చేపడుతామని స్పష్టం చేశారు. నివేదికను అధిష్టానానికి అందిస్తామని , అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, మహిళా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ