తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మార్కెట్ గురువారం ఉదయం నుంచే సందడిగా మారింది. ఎప్పటిలా కాకుండా ఈ రోజు ఓ అరుదైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షించింది. కిన్నెరసాని నది నుంచి పట్టుకున్న ఏకంగా 15 కిలోల భారీ చేప ఒకటి మార్కెట్కు అమ్మకానికి వచ్చింది. సాధారణంగా ఇంత పెద్ద చేపలు మార్కెట్లలో కనిపించడం చాలా అరుదు. ఈ భారీ చేపను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా, కాస్త దూరం నుంచీ ప్రజలు తరలివచ్చారు. కొందరు ఆశ్చర్యంతో చూస్తుంటే, మరికొందరు తమ సెల్ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ