Monday, 20 April 2026 01:51:33 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

భర్త మరియు అత్తమామల వేధింపులు భరించలేక మహిళ బలవన్మరణం

Date : 30 June 2025 06:30 PM Views : 910

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 30 తెలుగు వెలుగు )జూలూరుపాడు లో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.వివరాల్లోకి వెళితే రామవరం సుభాష్ చంద్ర బోస్ నగర్ కాలనీకి చెందిన, రాజేశ్వరి 34 సంవత్సరాలను, రఘునాథపాలెం మండలం, రాములు తండా కు చెందిన బానోతు రానా ప్రతాప్ తండ్రి పేరు: చంద్రం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఇచ్చి ,సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపించినారు. పెళ్లి సమయంలో 40 లక్షల రూపాయల నగదు తో పాటు, 35 తులాల బంగారం మరో నాలుగు లక్షల రూపాయల విలువచేసే ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చినామని, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానముగా కలరని, అయితే పెళ్లయిన తర్వాత వీరి సంసార జీవితం సజావుగానే సాగిందని, ఆ తరువాత రాజేశ్వరిను తన భర్త బానోతు రానా ప్రతాప్, అత్త పుష్పారాణి, మామ చంద్రం, బావ మహేష్ SI లు కలిసి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ, తాము చెప్పిన విధంగా నడుచుకోవాలని, అనుమానం అనే నెపముతో అక్రమ సంబంధాలు అంటగట్టి, తాము చెప్పిన ఇంట్లోనే ఉంటూ, సంసారం చేసుకోవాలని లేనిచో, ఆత్మహత్య చేసుకోవాలని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం వలన, ఒత్తిడి తట్టుకోలేక అవమానభారంతో ది 25. 6.2025న జూలూరుపాడు లో గల కిరాయి ఇంట్లో రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి, తాను మందు తాగానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజేశ్వరిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించినారని అచటి నుండి డాక్టర్ల సలహా మేరకు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్కు చికిత్స కొరకు తీసుకెళ్లారని, అటు తరువాత రాజేశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కిమ్స్ హాస్పిటల్ నుండి హైదరాబాదు నందు గల యశోద హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా, నిన్న అనగా తేదీ 29. 6. 2025న రాత్రి అందాజా 11:25 గంటల సమయంలో మరణించినట్లుగా డాక్టర్లు దృవీకరించినారని, తన కుమార్తె రాజేశ్వరిను ఆమె భర్త రాణా ప్రతాప్, అత్త పుష్పావతి, మామ చంద్రం, బావ మహేష్ ఎస్సైలు మానసికంగా శారీరకంగా వేధించి, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి, తన కూతురు చావుకి కారకులైన పై నలుగురిపై చర్య కొరకు మృతురాలి తండ్రి కేళోతు సోమ్లా, తండ్రి పేరు దేవుల, 60 సంవత్సరములు, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం పట్టణం కొత్తగూడెం ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు ఎస్సై రవి కేసు నమోదు చేయనైనది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :