Tuesday, 26 May 2026 11:23:24 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

పంట అవశేషాలను కాల్చవద్దని గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

Date : 24 May 2026 06:40 PM Views : 60

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు వంద శాతం పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. సన్‌ఫ్లవర్ కొనుగోళ్లకు వెంటనే ఏర్పాట్లు చేయాలి. పంట అవశేషాలను కాల్చకుండా ప్రతి గ్రామంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోళ్లను అనేక సవాళ్ల మధ్య కూడా సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది భారీ స్థాయిలో వరి దిగుబడి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు .ఇటీవల మంత్రివర్గం సన్‌ఫ్లవర్ పంట కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గతంలో రైతులకు ధాన్యం చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వ పాలనలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.పట్టణాభివృద్ధిలో వాయు కాలుష్య నియంత్రణ అత్యంత కీలకమని, పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యంతో పాటు పక్క పొలాలకు మంటలు వ్యాపించి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు.ప్రతి గ్రామంలో టామ్‌టామ్ ద్వారా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు పంట అవశేషాలను కాల్చవద్దని విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా ఎవరైనా పంట అవశేషాలను కాల్చేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని సూచించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మే చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు వంద శాతం పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హమాలీలు, రవాణా వంటి సమస్యల పరిష్కారానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వంద శాతం పెండింగ్ రైస్ డెలివరీ పూర్తి చేసిన డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి అండర్‌టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయాలని అన్నారు .మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మంత్రివర్గం సన్‌ఫ్లవర్ కొనుగోలుకు ఆమోదం తెలిపిందని, అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అన్నారు. చివరి గింజ వరకు పంట కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, వరి కొయ్యలను కాల్చకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను సజావుగా నిర్వహించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫిడెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనినా, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, డి సి ఓ శ్రీనివాస్ , డి సి ఎస్ ఓ ప్రేమ్ కుమార్, మెప్మా పీడీ రాజేష్, ఆర్టీసీ డిఎం, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :