తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ లోని పాత కొత్తగూడెం నాలుగో వార్డులో మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి గురువారం ఇంటింటికి తిరుగుతూ మంచినీటి సౌకర్యం, వీధిలైట్లు పారిశుద్ధ్యం సౌకర్యాల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు, మంచినీటి కనెక్షన్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీధిలైట్లు పాడైపోయి వెలగనివి సాయంత్రం కల్లా మరమ్మతులు చేసి వెలిగే లా చూడాలని అధికారులను ఆదేశించారు, అదేవిధంగా నల్లా నీరు వృధా కాకుండా టాపు లు అమర్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇ, ఏఈ, సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు మరియు ఎలక్ట్రిక్, వాటర్ సప్లై, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ