తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి పల్లెలో 'పచ్చదనం-స్వచ్ఛదనం' ఆవిష్కృతం కావాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సమిష్టి కృషితో వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చాతకొండ బీట్ పరిధిలోని రేగళ్ల రోడ్డులో శుక్రవారం జరిగిన వన మహోత్సవంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ