తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి అనుమతిస్తు సుప్రీంకోర్టు వెలవరించిన చారిత్రాత్మక తీర్పు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నియమించిన వర్గీకరణ కమిటీ, ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ సమీమ్ అక్తర్ గారికి ఖమ్మం కలక్టరేట్ కార్యాలయంలో ఈరోజు జులూరుపాడు మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యం ఆర్ పి ఎస్(టి ఎస్)కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మోదుగు రామకృష్ణ, సీనియర్ దళిత నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు వేల్పుల నర్శింహారావు,యం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు కోట కుమార్ బాబు ,యం ఆర్ పి ఎస్ నాయకులు పోతురాజు నాగరాజు,జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం(MJF) ప్రచార కార్యదర్శి ఐ న్యూస్ పాత్రికేయుడు తంబర్ల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ