Monday, 20 April 2026 01:45:01 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం, ఇల్లందు ఏరియాలకు సంయుక్తంగా 19, 17వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం.

Date : 16 July 2025 07:47 PM Views : 733

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ఆర్.సి.ఓ. ఏ క్లబ్ లో జరిగిన   కొత్తగూడెం ఇల్లందు ఏరియాలకు సంయుక్తంగా 19వ, 17వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆధ్వర్యంలో  ఈ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంనకు సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ & ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, గని ప్రమాదాలలో మరణించిన వారికి మౌనం పాటించారు. రక్షణ గురించి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం ఏరియా సేఫ్టీ అధికారి ఎం. వెంకటేశ్వర రావు గత 18వ రక్షణ సమావేశ మినిట్స్ పై ఏరియాలో రక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మరియు 12వ నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్స్ మినిట్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగినది. రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరియు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని జీరో హాం ( ప్రమాద రహిత) తో పనిచేయాలని తెలియజేశారు. అనంతరం ఇల్లందు ఏరియా సేఫ్టీ అధికారి ఎం.డి జాకీర్ హుస్సేన్ గత 16వ రక్షణ సమావేశ మినిట్స్ పై మరియు ఏరియాలో రక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగినది. అనంతరం యూనియన్ ప్రతినిధులు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ లు, అన్ని గనుల మేనేజర్లు, రక్షణ అధికారులు రక్షణ పై చర్చించారు.అనంతరం DGMS అధికారులు, DDMS మాట్లాడుతూ గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలపై చర్చించి, గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసినందుకు కొత్తగూడెం, ఇల్లందు ఏరియా వారిని అభినందించారు, ఇదే స్ఫూర్తితో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా రక్షణను ఇంకా మెరుగుపరచుకొని రక్షణతో కూడిన ఉత్పతి చేయాలని తగు సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. కొత్తగూడెం, ఇల్లందు ఏరియాలలోని అన్ని యూనియన్ ప్రతినిధులు, అన్ని గనుల ఏజెంట్లు మరియు ప్రాజెక్టు ఆఫీసర్స్, శాఖధిపతులు, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూపు ఇంజనీర్స్, రక్షణ అధికారులు, పిట్ ఇంజనీర్స్, ఏరియా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు వర్క్ మైన్ ఇన్స్పెక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతినిధులు,  యూనియన్ నాయకులు గనుల యొక్క పనితీరు మరియు రక్షణపై తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు తో పాటు ,ఉమేష్ మధుకర్ రావు సవార్కర్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, (మైనింగ్) ఎస్. ఆనంద్ వెల్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, (ఎలక్ట్రికల్) హైదరాబాద్, . చింతల శ్రీనివాస్ జిఎం (సేఫ్టీ), పి. సనత్ కుమార్ DDMS (మైనింగ్), కమలేష్ కుమార్ వర్మ DDMS (మైనింగ్), . దిలీప్ కుమార్ DDMS (మెకానికల్),. ఎస్.కె. నాగుల మీరా DDMS (ELE),. అంకిత్ సింగ్ DDMS ( మెకానికల్), ఎం. షాలేం రాజు, జిఎం కొత్తగూడెం ఏరియా, వి. కృష్ణయ్య, జిఎం ఇల్లందు ఏరియా, ఏరియా రక్షణాధికారి ఏం. వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జే. గట్టయ్య, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఇల్లందు ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎండి. నజీర్, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ జే. వెంకటేశ్వర్లు, కార్పొరేట్ నుండి ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ వి. వెంకటేశ్వర రావు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ పీతాంబర్ రావు, ఏరియా అధికారుల సంఘం ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా ఎం.వి నరసింహారావు, కార్పొరేట్ ఎస్.వెంకటాచారి, ఇల్లందు ఏరియా ఏజి. శివప్రసాద్, జిఎం (సేఫ్టీ) కొత్తగూడెం రీజియన్ కే.జి.తివారి, జిఎం (ఈ&ఎం) సెంట్రల్ వర్క్ షాప్ ఎన్. దామోదర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్, ఎస్ ఓ టు జిఎం జీవీ కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్ జీకే ఓసి ఎం. శ్రీ రమేష్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జేవిఆర్ ఓసి ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, డిజిఎం ( పర్సనల్) జి.వెంకట మోహన్ రావు, అన్ని గనుల వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ కాంట్రాక్ట్ రిప్రజెంటేటివ్స్, అన్ని యూనియన్ ప్రతినిధులు, అన్ని గనుల ఏజెంట్లు మరియు ప్రాజెక్టు ఆఫీసర్స్, శాఖధిపతులు, మేనేజర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, గ్రూపు ఇంజనీర్స్, రక్షణ అధికారులు, పిట్ ఇంజనీర్స్, ఏరియా స్టక్షర్ కమిటీ సభ్యులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతినిధులు,  యూనియన్ నాయకులు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :