తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం 02 Sep తెలుగు వెలుగు టీవీ : గత 20 ఏళ్లకు పైగా సాగులో ఉన్న భూములను ఈ సంవత్సరం ఫారెస్ట్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతులకు చెప్పకుండా జంక్షన్ చేయడానికి తీవ్రంగా ఖండించాలని ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయం నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు చర్ల దుమ్ముగూడెం పాల్వంచ జూలూరుపాడు మండల ప్రాంతాలలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములలో చేతికొచ్చిన పంటని ధ్వంసం చేస్తూ తిరిగి ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్నారని బెదిరింపులకు గురి చేస్తున్నారని జాతి వివక్షతతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.పత్తి చేలు మొత్తం పిందె పడి కాయ దగ్గరికి వచ్చిందని నోటికి వచ్చిన పంటను గద్దె వచ్చి తనుకుపోయే విధంగా ఫారెస్ట్ వారు వచ్చి నాశనం చేశారని వారు అన్నారు. ఫారెస్ట్ అధికారుల కండ ముందే సర్వేలు చేసి హద్దులు పెట్టుకొని భూములు సాగు చేసుకుంటుంటే ఈరోజు ఫారెస్ట్ అధికారులు అక్రమంగా పంటలను ధ్వంసం చేస్తున్నారని వారన్నారు జూలూరుపాడు మండలం ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడిమే హిడ్మ 30 గుంటల భూమిని మొత్తం సర్వనాశనం చేశారని పాల్వంచ మండలం బంజర, చిరుతంపాడు, పడగొని గూడెం, భూమిని చర్ల దుమ్ముగూడెంలో రెండు వందల ఎకరాల భూములలో పంటలను మొత్తం సర్వనాశనం చేశారని, పైగా ఏడుగురు మహిళలపై కేసులు నమోదు చేశారని ఈ దురంకార చర్యలు మానుకోవాలని వారన్నారు. అటవీ హక్కుల చట్టం, పిసా తీర్మానాలను ఉల్లంఘిస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పంట నష్టం పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జాతి వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని వారు అన్నారు. రైతులు ఫారెస్ట్ వారి కళ్ళముందే సాగు చేసుకుని అప్పులు చేసి ఆలి పుస్తకాలు అమ్ముకొని విత్తనాలు తీసుకొచ్చుకొని పంట వేసే వరకు ఏమి మాట్లాడకుండా ఇప్పుడు పంట చేతికి వచ్చినాక జంక్షన్ చేయడం అంటే రైతులను మానసికంగా చంపడమేనని ఫారెస్ట్ వాళ్ళ కళ్ళముందే పంటలు వేసుకుంటుంటే అడ్డుచెప్పని ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఎందుకు పంటలను ధ్వంసం చేస్తున్నారో సమాధానం చెప్పాలని వారు అన్నారు.ఈ చర్యలను ఫారెస్ట్ వారు ఆపకపోతే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు సత్యమ్మ, సారమ్మ, ముత్తమ్మ, లింగయ్య, నాగయ్య, కొమరయ్య, అనిల్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ