తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజు కొత్తగూడెం పట్టణంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, డీపీవో కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధితో భాదపడుతున్న చిన్నారుల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశామని నిర్వాహుకులు తెలిపారు. ఈ కార్య క్రమంలో అధికారులు రమణ, మహేష్ పంచాయతీ కార్యదర్శులు కిరణ్, వంశీ కృష్ణ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ