తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రథసప్తమి సందర్భంగా ఈ రోజు శ్రీ పాండురంగ భజన మందిరం కొత్తగూడెంలో ఉదయం 11 గంటలకు శ్రీ కుసుమ హరినాథ్ బాబా లీలా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణానికి కుసుమహరుల నూతన ఉత్సవ విగ్రహాలను శ్రీ శ్యాoసుందర్రావు, ద్రౌపది దంపతులు సమర్పించినారు. కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పూజారులు శ్రీ రమణాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తoగా జరిపించారు. కళ్యాణములో అనేక మంది భక్తులు పాల్గొని ప్రత్యక్షంగా కళ్యాణం తిలకించి తరించారు. కళ్యాణానంతరము ఆశీర్వాదం పొంది, అన్న ప్రసాదం స్వీకరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ