తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జులై 24 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రెండు గ్రూపులుగా విడిపోయి వేరు వేరు చోట్ల కేకులు కట్ చేసి జన్మదిన సంబరాలు జరిపారు. వివరాలు మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఉన్నప్పుడు అంతా ఒకే తాటిపై నడిచిన వారు ఆయన స్వర్గస్తులైన పిదప పార్టీలో ఒక్కసారిగా గ్రూపు లుగా బహిర్గతమయ్యాయి. ఒక గ్రూపు లకావత్ గిరిబాబు, చావా వెంకట్ రామారావు, చాపలమడుగు రామ్మూర్తి, రెండవ గ్రూపులో మాజీ ఎంపీపీ చిట్టిబాబు, యదలపల్లి వీరభద్రం, దుద్దుకూరి నాగేశ్వరరావు లు ఇలా విడివిడిగా జన్మదిన వేడుకలు జరపటంపై రానున్న స్థానిక ఎన్నికలపై బిఆర్ఎస్ పార్టీ అభిమానుల్లో కలవరం మొదలైనది
Admin
తెలుగు వెలుగు టీవీ