తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం, భద్రాద్రి కొత్తగూడెం నందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థినీ-విద్యార్థులకు మరియు పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్రంలోనే మన జిల్లాను మంచి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కష్టపడే ప్రతి విద్యార్థికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జీ. మణి మృదుల, రిటైర్డ్ ఉద్యోగి జీ. జాన్, విద్యార్థినీ-విద్యార్థులు, పాఠకులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ