Friday, 19 June 2026 04:17:44 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

జనసేన పార్టీలో చేరిన డాక్టర్ గడల శ్రీనివాసరావు.

Date : 03 June 2026 06:16 PM Views : 448

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గడల‌ శ్రీనివాసరావుకి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, డాక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహిత అనుబంధం ఉందన్నారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, నిజాయతీ, పరిపాలనా దక్షత కలిగిన అధికారిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రజల్లో విశేష గౌరవం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ వైద్యుడిగా ప్రారంభమైన ఆయన సేవా ప్రస్థానం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.డాక్టర్ గడల శ్రీనివాసరావు వంటి అనుభవజ్ఞులు, సేవాభావం కలిగిన వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని, విశ్వసనీయతను తీసుకువస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, పరిపాలనా అనుభవం, సమాజంలోని వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న అనుబంధం తెలంగాణలో పార్టీ విస్తరణకు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.సమాజ సేవను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావును హృదయపూర్వకంగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం మెగాస్టార్ చిరంజీవి ద్వారా ప్రారంభమైందని తెలిపారు. కాలక్రమేణా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయతీ, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయం కాదని, సమాజానికి మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఆలోచిత నిర్ణయమని స్పష్టం చేశారు. యువతకు ఆశయాలను, దిశానిర్దేశాన్ని అందించే నాయకత్వం పవన్ కళ్యాణ్ లో కనిపించిందని అన్నారు.ప్రస్తుత తరానికి విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని, ఆ లక్ష్యంతో పనిచేస్తున్న జనసేన పార్టీ తనకు సరైన వేదికగా భావించానని తెలిపారు. ఇకపై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.ప్రజాసేవే తన జీవిత లక్ష్యమని, ప్రభుత్వ సేవలో ఉన్నప్పుడు ఎలా అంకితభావంతో పనిచేశానో, ఇకపై ప్రజా జీవితంలో కూడా అదే నిబద్ధత, చిత్తశుద్ధితో ముందుకు సాగుతానని డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ప్రజారోగ్య కార్యకర్తలు, యువత, మహిళలు, మేధావులు మరియు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రభుత్వ సేవా కాలంలో అందించిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం, సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.అలాగే కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో తనతో కలిసి పనిచేసిన మీడియా మిత్రులు, జర్నలిస్టులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే తన భవిష్యత్ కార్యక్రమాలకు కూడా ఇదే సానుకూల సహకారం, ఆదరణ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ సమాజ అభ్యున్నతి, యువత సాధికారత, మహిళల పురోగతి, ప్రజారోగ్య పరిరక్షణ మరియు ప్రజా సంక్షేమమే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యాలని, ప్రజల ఆశీస్సులు, సహకారం తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :