తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతమైన రామవరం పట్టణంలో నీ మాదిగ సంక్షేమ సంఘం(అంబేద్కర్ భవన్) ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించగా అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా గ్రామంలో ఏప్రిల్ 5 ,1908 వ సంవత్సరంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధించడం జరిగిందన్నారు . జగ్జీవన్ రావ్ 1935 లో అఖిల భారత అణగారిన వర్గాల కూటమి ఏర్పాటు చేశారని, 1936 నుండి 1986 వరకు భారత పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించి ప్రపంచ రికార్డు సృష్టించారని,అందుకే బాబు జగ్జీవన్ రావు కి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య , ఇండిగపల్లి శంకర్, కూరగాయల శ్రీనివాస్,కొత్తూరు మదనయ్య , ఓడ్డూరి హరిబాబు, జనగం రాజయ్య,కే. నర్సయ్య, మాటేటి అంజయ్య, నమిల్ల మధు, తిప్పారం ఎల్లయ్య, రామచందర్,బిర్రు శ్రీను, ఎస్.కె నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ