తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ శేఖరం బంజర యుపిహెచ్సి పరిధిలోని మంచి కంటి నగర్ ని సందర్శించడం జరిగినది.కుష్టు వ్యాధుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా మంచి కంటి నగర్ నందు జరుగుతున్న సర్వేను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా యూపీహెచ్సీని ఆకస్మిక తనిఖీని నిర్వహించి రికార్డులను పరిశీలించటం జరిగినది. వైద్య సిబ్బంది సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సమయపాలన పాటించాలని సూచించడం జరిగినది పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యుపిఎస్సి వైద్యాధికారి మరియు డిపిఎంవో మోహన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ