తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్టార్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థి ప్రతిభకు దేశస్థాయి లో గుర్తింపు కొడగు సైనిక్ స్కూల్, కర్ణాటక లో ప్రవేశం డి ఈ ఓ సహా పలువురి అభినందనలు పాల్వంచ విద్యార్థి జీవితంలో ఒక మైలురాయి విజయాన్ని నమోదు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ విద్యార్థి సిద్దుల హర్షవర్ధన్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యా సంస్థలలో ఒకటైన కొడగు సైనిక్ స్కూల్,కర్ణాటక లో 9వ తరగతిలో ప్రవేశం పొంది జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి, విద్యార్థిని అభినందిస్తూ హర్షవర్ధన్ సాధించినది ఒక అసాధారణ ఘనత అని , ఈ విజయం కేవలం విద్యకు సంబంధించినది మాత్రమే కాదని,దేశ సేవకు పునాదులు వేయడంలో కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు కూడా క్రమశిక్షణ, నిరంతర కృషి, అంకిత భావం ఉంటే ఎంతటి ఘన విజయాన్ని అయినా సాధించవచ్చునని హర్షవర్ధన్ నిరూపించాడని, ఈ విజయం వెనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉన్నదని అభినందించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జి భాస్కరరావు, ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, సహ విద్యార్థులు హర్షవర్ధన్ ప్రతిభను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ