తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 28 తెలుగు వెలుగు) : కొత్తగూడెం ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న వి.కే.ఓ.సీ ని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా గతంలో జికేఓసి ని నడిపించన విధంగా OB మరియు కోల్ పూర్తిగా మన సింగరేణి ఉద్యోగులతో తీసి నడిపించాలని జికేఓసి మేనేజర్ శ్రీ మురళి గారికి వినతి పత్రం ఇచ్చి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి కార్మికుల వినతిని పంపవలసిందిగా కోరడం జరిగింది. టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ మాట్లాడుతూ గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన ఉంటూ కార్మికుల అనేక హక్కులు తీసుకురావడం జరిగిందని అన్నారు. గెలిచిన యూనియన్లు సింగరేణిలో గెలిచిన నాటినుండి కార్మికులకు ఏ ఒక్క హక్కు తీసుకురాలేదు కార్మికులకు ఇచ్చిన హామీలు పట్టించుకోవడమే మరిచారని ఇప్పటికైనా అన్ని యూనియన్ కలుపుకొని అయినా వికే ఓసి ని సింగరేణి కార్మికులతో నడిపే విధంగా ఎండి గారిని, ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య సెంట్రల్ కమిటీ మెంబెర్స్ కాగితపు విజయకుమార్, బొరింగ్ శంకర్, బ్రాంచ్ సెక్రెటరీ రాజ్ కుమార్, పివికే 5 ఫిట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు టీబీజీకేస్ నాయకులు మరియు జికేఓసి ఉద్యోగులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ