తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రం లోని 60వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలో గల కూలిలైన్ సెక్టార్ పరిధిలో 8 వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ తోట పద్మశ్రీ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యం కోసం సమతుల పోషకాహారాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆకుకూరలు, పండ్లు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. సూపర్వైజర్ శారద మరియు టీచర్లతో కలిసి పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమము నిర్వహించి అక్కడికి వచ్చిన తల్లులకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగింది. పరిశుభ్రత స్వచ్ఛమైన త్రాగునీరు ప్లాస్టిక్ వాడకం నిషేధం పై మరియు చిరుధాన్యాల వాడకం గురించి తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ, సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు తల్లులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ