తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భానోతు కబీర్ దాస్ ,తండ్రి పేరు: లచ్చు, 45 సంవత్సరాలకు మాచినపేట రెవెన్యూ పరిధిలో 0.35 గుంటల వ్యవసాయ భూమి ఉన్నదని, అట్టి భూమిని కబీర్ దాస్ అన్న కొడుకు అయిన బానోతు లింగ ఆక్రమించుకొని, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసినాడని, అట్టి భూమి లింగాదే అంటూ బానోతు హేమ్ల తప్పుడు కాగితాలు రాసినాడని, అదే భూమిని కబీర్దాస్ పేరుమీద పట్టా చేయిస్తానని గుగులోతు కృష్ణ అనే అతను మూడు లక్షల రూపాయలు కబీర్ దాస్ వద్ద తీసుకున్నాడని, మరోపక్క గ్రామ పెద్దమనిషి అయిన భానోతు కిషన్ కలుగజేసుకుని అట్టి భూమి కబీర్దాస్ పేరుమీద పట్టా చేయించవద్దంటూ లింగాపై ఒత్తిడి చేశాడని, అయితే మృతుడు కబీర్ దాస్ తన భూమి చుట్టూ లింగా వేసిన ఫెన్సింగ్ తీయించాలని, లింగ మరియు సునీతలను వేడుకున్నను, మృతుడి మాటలు లెక్కచేయకుండా ఏం చేసుకుంటావో, చేసుకో అని బూతులు తిట్టినారని, బానోతు లింగ మరియు లింగా భార్య సునీతలు బానోతు హేమ్ల, గుగులోతు కృష్ణ, బానోతు కిషన్ ల ప్రోత్బలంతో కబీర్ దాస్ ను అనేక ఇబ్బందులకు గురి చేయగా, వారు పెట్టిన ఇబ్బందులు తాళలేక మరియు తన భూమి తనకు దక్కకుండా పోతుందేమోనన్న భయముతో కబీర్ దాస్ తేదీ 21.10.2025న ఇంట్లోనే ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు గమనించి, చికిత్స కొరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, మరల అచ్చటి నుండి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించినను కబీర్ దాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి నందే చికిత్స పొందుతూ ,ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో మృతి చెందినాడని,మృతుడి కుమారుడు భానోత్ నందు, 19 సంవత్సరములు, ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి బానోతు లింగ, సునీత, బానోతు హేమల, గుగులోతు కృష్ణ, బానోత్ కిషన్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ