తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఘనంగా పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం శుక్రవారం నాడు స్థానిక సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ నందు గల మీటింగ్ హాల్లో జిల్లా మహిళా , శిశు , దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి జె.స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమము, అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే, అక్షరభ్యాసం, అన్నప్రసనా, గర్భిణీలకు శ్రీమంతాలు, జిల్లా స్థాయిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి సిడిపివోలకు, సూపర్వైజర్లకు, పోషణ అభియాన్ సిబ్బందికి, అంగనవాడి టీచర్లకు మేమేంటో,ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ విద్యచందన మాట్లాడుతూ ఆరోగ్యవంతులైనా పౌరులే దేశానికి అసలైన సంపద అని మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడి కావాలన్నారు. ఈ పోషణ పక్వాడా స్ఫూర్తిని ఈ 15 రోజులే కాకుండా, ఏడాది పొడవునా కొనసాగించే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించి అంగన్వాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కోరారు.2026 పూర్తి అయ్యే నాటికి మన జిల్లా పోషకాహార లోప రహిత జిల్లాగా నిర్మించుకోవాలనే లక్ష్యంగా పెట్టుకొని క్షేత్రస్థాయిలో సిబ్బంది పని చేయాలని, కేవలం ఆహారం తినడం వేరు, శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందేలా 'పోషక విలువలు' ఉన్న ఆహారం తీసుకోవడం వేరు అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినా మాట్లాడుతూ పోషణ పక్వాడ 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 2061 అంగనవాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులతో పాటు ప్రజలలో కూడా పౌష్టికాహార విలువల పై అవగాహన పెంపొందించామని తెలిపారు.ఒక బిడ్డ ఆరోగ్యం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే మొదలవుతుందని, గర్భిణీ స్త్రీలు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లతో పాటు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి బలమైన ఆహారం తీసుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వల్ల ఆ బిడ్డకు జీవితాంతం అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుంది అన్నారు, జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలలో కాలానుగుణంగా సామూహిక వేడుకలైన అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతాలు నిర్వహించినట్లయితే పౌష్టికాహార విలువలపై ఆరు సంవత్సరాల లోపు పిల్లల ఎదుగుదలపై మరింత అవగాహన కల్పించినట్లయితే ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యులవుతారని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అంగనవాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యాభ్యసించిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడంతోపాటు, అన్న ప్రాసన , అక్షరాభ్యాసం , శ్రీమంతాలు , పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటోలు , సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీలత, వైద్య విద్య శాఖ అధికారులు సతీష్, డాక్టర్ రాకేష్, జిల్లాలోని సిడిపివోలు, సూపర్వైజర్లు, అంగనవాడి టీచర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, జిల్లా మహిళా సాధికారిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ