తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 25తెలుగు వెలుగు)బిజెపి పార్టీ మండల సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఎంత అప్పు ఉన్నా సరే రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చినది, కొంతమంది రైతులకే మాఫీ చేసినది,65 లక్షల మంది రైతులు ఉంటే సుమారు 20 లక్షల రైతులు మాత్రమే రుణమాఫీ చేసినది, రెండు లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా పైన ఉన్న డబ్బులు కట్టండి వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి , మంత్రులు పదే పదే చెప్పినారు, వీరి మాటలు నమ్మి చాలా మంది రైతులు రెండు లక్షల పైనున్న డబ్బులు కట్టినారు, కానీ మాఫీ చేయలేదు, పానీ నక్కల మీద రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ కాలేదు, రైతు భరోసా ఖరీఫ్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రబీలో ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రెండు మూడు ఎకరాలకు మాత్రమే డబ్బులు రైతుల ఖాతాలో వేసినారు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కొద్దిమందికి మాత్రమే 6000 రూపాయలు ఇచ్చినారు, పంటలన్నింటికీ కూడా బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఒక సన్న వడ్లకు మాత్రమే ఇస్తున్నారు, పంటల బీమా, రైతు బీమా అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను, వ్యవసాయ కూలీలను, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను, వికలాంగులను అందరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినది,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, తెల్లం నరసింహారావు భూక్య రమేష్, భూక్య రవి, నిమ్మటూరి రామారావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ