తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 5(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల వ్యాప్తంగా చెరువులు,కుంటలు కబ్జాకు గురై నీటి నిలువ ఉండే వీలు లేక భూగర్భ జలాలు అంతరించిపోతూ ఉన్నవి రైతుల పంటలకు నీరు అందక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటన్నిటికీ పరిష్కారం కావాలి అంటే మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు నక్షాలో ఉన్నట్లుగా సర్వే చేసి హద్దులు నిర్మిస్తేనే చెరువులు కుంటలు మిగులుతాయి అంటూ ఈరోజు జూలూరుపాడు తహసిల్దార్ కార్యాలయం ముందు శాంతియుత దీక్ష చేపట్టిన మండల నాయకులు .ఈ కార్యక్రమంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గ ప్రసాద్ నాయక్, బి.ఎస్.పి పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి జర్రిపోతు నరేష్ కుమార్ , బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు, మాల మహానాడు మండల అధ్యక్షులు బడుగు వీరస్వామి , చరణ్ ,బాలు ,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ