Tuesday, 26 May 2026 11:25:40 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

ప్రజావాణిలో వినతులపై తక్షణ చర్యలు – అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశాలు

Date : 04 May 2026 05:53 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ పిడి రవీంద్రనాథ్ తో కలసి ప్రజల నుండి వచ్చిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతి వినతిపత్రాన్ని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదులోని మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ వినతులను పూర్తి వివరాలతో, అవసరమైన ఆధార పత్రాలతో సమర్పిస్తే పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి ఫిర్యాదుకు సమర్థవంతమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన భూలక్ష్మి తన రేకుల ఇల్లు శిధిలావస్థలో ఉందని, పలుమార్లు ఇందిరమ్మ గృహం కోసం దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదని వినతి సమర్పించారు. దీనిపై రెండో విడతలో గృహం మంజూరు అంశాన్ని పరిశీలించాలని గృహ నిర్మాణ శాఖ పీడీకి ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని దుర్జనుబస్తీకి చెందిన నోముల వీరకుమారి తన భర్త గుండెపోటుతో మరణించడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, జీవనోపాధి కల్పించాలని అభ్యర్థించారు. ఆమె వినతిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన భూక్య చంద్రనాయక్ తనకు ఉన్న 18.12 ఎకరాల భూమిలో కొంతభాగాన్ని కుమారులకు బదిలీ చేయడానికి దరఖాస్తు చేసినప్పటికీ కే-ఫామ్ జారీ కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఓఎస్‌డీకి ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం సూదిమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌కు చెందిన వేమూరు వీరస్వామి తన ఇంటిని తన సోదరుడు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డీపీఓకు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లికి చెందిన గోరియా తన 3 ఎకరాలు 20 కుంటల భూమికి పట్టా కోసం పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదని వినతి సమర్పించారు. ఈ అంశంపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని టేకులపల్లి తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :