తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 12(తెలుగు వెలుగు)చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో ఉన్న జలగం వెంగళరావు ప్రాజెక్ట్ గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు సామర్ధ్యానికి మించి వరద వచ్చినందువలన అలుగుకు గండిపడి నీరు వృధాగా పోతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం రైతాంగానికి వ్యవసాయ రంగానికి నీరందించటానికి తాత్కాలిక మరమ్మత్తులకు 10 లక్షల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులను జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ తో ఈరోజు పర్యవేక్షించడం జరిగింది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ తాత్కాలిక మరమ్మత్తులను కొద్దికాలంలోనే పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. అలాగే వచ్చే వర్షాకాలం నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 34 కోట్ల రూపాయలు అవసరమవగా ప్రతిపాదనలు పంపించామని ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసి నిధులను మంజూరు చేయడానికి అంగీకరించిందని అందువల్ల రాబోవు వర్షాకాలం నాటికి రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, రైతులు,ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ