తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం పంచాయతీ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వెన్నెలబైలు గ్రామానికి చెందిన పర్సిక రాజు (35) అనే యువకుడు బైకుపై తన పొలం వద్దకు వెడుతుండగా, హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలి అతను ప్రయాణిస్తున్న వాహనం దగ్ధమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ మంటల్లో సజీవ దహనమవుతున్న రాజును చూసి అతని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ