తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ సెంటర్లో " చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం" అనే ప్రోగ్రాంలో భాగంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు,సుజాతనగర్ ఎస్సై రమాదేవి , సిబ్బంది పాల్గొన్నారు.ఇట్టి ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం కాలేజ్,ధన్వంతర కాలేజ్ ,శ్రీ ఫార్మసి కాలేజ్ మరియు సుజాతనగర్ హైస్కూల్ కు చెందిన స్టూడెంట్స్,అదే విధంగా సుజాతనగర్ మండలానికి చెందిన రాజకీయ నాయకులు, మీడియా మరియు ఇతర పబ్లిక్ మొత్తం దాదాపు 700 మంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ నెల 15వ తారీకు నుండి వచ్చే నెల 15వ తారీకు వరకు ప్రతిరోజు చేపట్టే చైతన్యo ప్రోగ్రాంలో భాగంగా జనాలకు డ్రగ్స్ గురించి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డిఎస్పీ రెహమాన్ అన్నారు. డ్రగ్స్ అమ్మకం,రవాణా,కలిగి ఉండడం,సేవించడం,కొనడం చట్టరీత్యా నేరమని,ఆఁ విధంగా ఎవరైనా పట్టుబడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ