తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వచ్చేనెల 6వ తేది నుండి అత్యంత వైభవంగా నిర్వహించబడనున్న మహా కుంభాభిషేక మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను హైదరాబాద్ సెక్రటేరియట్ లో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ద్వారా మర్యాదపూర్వకంగా అందజేయడం జరిగింది ఈ మహోత్సవాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడనున్నాయి ఈ సందర్భంగా మహా కుంభాభిషేకం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధికి శాంతి సౌభాగ్యాలకు దోహదపడుతుందని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఈ మహోత్సవాలను విజయవంతం చేయడానికి సహకారం అందించాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమం అన్నపురెడ్డిపల్లి ప్రాంతానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ సభ్యులు కాలోజీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ