తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాత పాల్వంచ గడియ కట్టలోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా సామూహిక లలితా సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. పూజారి కందాళ సింహాద్రి ఆనంద కుమారాచార్యులు మహిళలచే కుంకుమ పూజ చేయించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ఉత్సవ కమిటీ సభ్యులు బర్ల అన్వేష్, కొండపల్లి నాగరాజు, రొండ్ల శంకర్ రెడ్డి, బట్ట సాగర్, మాడి శెట్టి జయంత్, బట్ట మణికంఠ, బూతం జగన్, గూడపాటి ప్రవీణ్, కట్టా శ్రీను, పిల్లల బాలాజీ, కమిటీ సభ్యులు, ఏరియా పెద్దలు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ