తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : కొత్తగూడెం జిల్లాకలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు ధనసరి సీతక్క (అనసూయ) సమక్షంలో, జిల్లాకలెక్టర్ అంకిత్ అధ్యక్షతన అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో కలసి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది గ్రామాల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని అన్నారు ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యకు సంబంధించిన వివరాలు సులభంగా నమోదు చేసి, ప్రభుత్వానికి వెంటనే చేరవేయవచ్చని తెలిపారు దీంతో సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శిశు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పలు పథకాలను అమలు చేస్తోందని అంగన్వాడీ సిబ్బంది ఆ పథకాల అమలులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అందించిన స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకొని సేవలను ఇంకా సమర్థంగా అందించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ