తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.చైతన్యం పేరుతో ఎస్పీ సారథ్యంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగాఈ అవగాహనా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను తెలిపారు.ఇల్లందు పట్టణంలో గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు చైతన్యం (డ్రగ్స్ పై యుద్ధం) ర్యాలీని నిర్వహించారు.గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన పడటం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు.ఇలాంటి మహమ్మారిని సమాజం నుండి ప్రారదోలటానికి కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.ఈ రోజు జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు,స్థానికులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీతో పాటు సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ