తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏప్రిల్ 19 (తెలుగు వెలుగు) : బాబాసాహెబ్ డా.బి.ఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుటకు పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కి , అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో శాలువ కప్పి గౌతమ బుద్ధుడి చిత్రపటాన్ని బహూకరించి ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర బాధ్యులు జే.బి.శౌరి,అంబేడ్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ మారపాక రమేష్,దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ అంబేడ్కర్ సెంటర్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలని నిర్వహించారని,పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ సంధర్భంగా ఎంతో సహకరిస్తూ శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగనీయకుండా ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తూ వేలాదిగా వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందించారని కమిటీ సభ్యులు తెలిపారు . ఈ కార్యక్రమంలో ,మధుసూదన్ చిన్ని,మంద హనుమంతు,హై కోర్టు న్యాయవాది యెర్రా కామేష్, చదలవాడ సూరి,మందా సాంబయ్య,గడ్డం రాజశేఖర్,అజ్మీర సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ