Wednesday, 15 April 2026 06:31:29 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి,TUCI జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రావు.

Date : 03 February 2026 08:14 PM Views : 174

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏధులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు 2026 ఫిబ్రవరి 12 న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస హక్కులు కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం 2025 ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీ కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని,పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర బిజెపి తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారుప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలని జరగబోయే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారుపార్లమెంటులో మంద బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారని గోపాలరావు దుయ్యబట్టారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి యు సి ఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు రాయల సిద్దు, కార్మికులు రాధ స్రవంతి, స్వరూప, రమాదేవి, రజిత, శ్రావణి,సునీత, లక్ష్మి అరుణ శిరీష, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :