తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కోరం నరేష్ (35) అనే రైతు శనివారం తెల్లవారుజామున చనిపోయాడు. కుటుంబీకుల కథనం ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళగా కిడ్నీల సమస్య ఎక్కువగా ఉందని వెంటనే డయాలసిస్ చేయించుకోవాలని చెప్పారని. తమ దగ్గర డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళామని అక్కడ స్లాట్ దొరకడానికి 15 రోజులు టైం పడుతుందని చెప్పారు అని అన్నారు. మా దగ్గర ఆర్థికంగా స్తోమత లేనందువలన ఇలా నా భర్తను కొలిపోయానని భార్య రోదన గ్రామస్తులను చలింప జేసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ