తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 5 (తెలుగు వెలుగు) మార్చి లో జరిగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ MLC ఎన్నికలలో అర్హత గల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు తమ ఓటును బాధ్యతగా భావించి వెంటనే నమోదు చేసుకోవలసిందిగా ఎ.పి. యు.ఎస్ మరియుటి.పి.యు.ఎస్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు తీకుళ్ళ సాయిరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ దండా మురళీధర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆచార్యులను కోరారు. మంగళవారం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ను, జి.ప.ఉ.పా.జూలూరుపాడు, సుజాతనగర్,ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయ MLC ఓటు నమోదు చేసుకోవలసిందిగా కోరనైనది. వారితో మాట్లాడుతూ ఆన్ లైన్లో / ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకొనుటకు 1)దరఖాస్తు ఫామ్.19.....2)సర్వీస్ సర్టిఫికెట్ పైన ప్రిన్సిపాల్ సంతకం చేసిన సర్వీస్ సర్టిఫికెట్ కాపీ 3)ఓటరు ఐడి, 4).ఆధార్ కార్డ్, 5)పాస్పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలన్నారు. 2019 లో ఉన్న ఓటర్ జాబితా పూర్తిగా రద్దయినందున ప్రతి ఒక్కరూ మళ్ళీ నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు.నమోదుకు రేపు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్నదని వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత మార్చి నుండి ఉద్యోగవిరమణ పొందిన వారు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం విద్యారంగ, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ఆచార్యుల సమస్యలు, మెడికల్ కళాశాలల సమస్యలు పరిష్కరించ బడాలంటే, ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాలు కాపాడ బడాలంటే విద్యారంగ అభివృద్ధికి పాటుబడే జాతీయవాదులకు అండగా నిలిచి కౌన్సిల్ కు పంపాలని ఉపాధ్యాయులను సాయిరెడ్డి కోరారు. ,టిపియుఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు డి. సురేష్, ప్రధానకార్యదర్శి బి. కృష్ణ, మాజీ అధ్యక్షులు శివరామ కృష్ణ, పాండురంగాచారి, ప్రిన్సిపాల్స్,అధ్యాపకులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.తీకుళ్ళ సాయిరెడ్డి, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, ఎ పి యు ఎస్ మరియు టి.పి.యు.ఎస్.
Admin
తెలుగు వెలుగు టీవీ