Friday, 19 June 2026 04:17:46 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట భారీ ధర్నా – ముట్టడి నిర్వహించిన ఎఐటీయూసీ నాయకులు.

Date : 03 June 2026 06:07 PM Views : 28

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మెడికల్ ఫిట్ అయిన వారసులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి.కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట భారీ ధర్నా – ముట్టడి నిర్వహించిన ఎఐటీయూసీ నాయకులు.సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా–ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు మాట్లాడుతూ, ఉద్యోగంలో ఉన్న సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో కార్మికులు తమ సేవలను కోల్పోయిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అయితే మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక కుటుంబాల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యాన్ని కోరారు.సింగరేణి సంస్థ లాభాల సాధనలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెడికల్ ఫిట్ అయిన ప్రతి వారసుడికి ఆలస్యం లేకుండా నియామక పత్రాలు అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అనంతరం నాయకులు జనరల్ మేనేజర్ షాలెం రాజు కు వినతిపత్రం అందజేశారు. సమస్యను సానుకూలంగా పరిశీలించిన జీఎం, మెడికల్ ఫిట్ డిపెండెంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, కమల్, సౌజన్య, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, సురేందర్, మాచర్ల శ్రీనివాస్, కొవ్వూరి రాజేశ్వరరావు, బండారి మల్లయ్య, అప్పారావు, శశివర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న వారసులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: