Sunday, 21 June 2026 03:18:32 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని రద్దు చేయాలి : ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య

Date : 20 June 2026 05:03 PM Views : 173

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్యూఆర్ కోడ్ నిబంధనతో వాహనదారులపై మోయలేని ఆర్థిక భారం ప్రైవేట్ కంపెనీల దోపిడీకి రవాణా శాఖ ఊతమివ్వడం దుర్మార్గం ఆటో డ్రైవర్లను, వాహన యజమానులను నిలువునా ముంచుతున్న నిబంధనలు టేపుల పేరుతో రేట్లు పెంచి చేస్తున్న దోపిడీని తక్షణమే ఆపాలి చట్టంలో లేని నిబంధనలను గుట్టుగా అమలు చేయడంపై ఉద్యమిస్తాం ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య రెట్రో రిఫ్లెక్టివ్ టేప్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఈ విధానం వల్ల ఆటో డ్రైవర్లతో పాటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక నష్టం కలుగుతున్నాయని ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెం పరిధిలోని ఆర్టీఏ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శనివారం భారీ ధర్నా నిర్వహించి, అనంతరం ఆర్టీఏ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేకపోయినా రవాణా శాఖ వీటికి కొత్తగా క్యూఆర్ కోడ్ నిబంధనను చేర్చి ప్రైవేట్ కంపెనీల దోపిడీకి ఊతమిస్తోందని మండిపడ్డారు. గతంలో వాహనదారుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన రవాణా శాఖ, ఇప్పుడు మళ్లీ గుట్టుగా ఈ దోపిడీ విధానాన్ని అమలులోకి తెచ్చిందని విమర్శించారు. సాధారణ రిఫ్లెక్టివ్ టేపుల కంటే రెట్టింపు ధరలతో విక్రయిస్తూ, వాహనం చుట్టూ 22 మీటర్ల నుంచి 26 మీటర్ల వరకు టేపులను అతికించాలనే కొత్త నిబంధనతో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, లారీలు, బస్సుల యజమానులపై వేలాది రూపాయల అదనపు భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి లాభం చేకూర్చడం కోసమే ఈ దోపిడీకి రంగాన్ని సిద్ధం చేశారని, తక్షణమే ఈ నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, చింటూ, సురేష్, మోహన్, శీను, సోను, స్వామి తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :