Friday, 19 June 2026 06:46:00 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 29 January 2025 06:09 PM Views : 729

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలి.. పీఎం కూసుమ్ పథకం లో సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనకు అనువైన భూములు గుర్తించాలి... వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా తగిన చర్యలు చేపట్టాలి... క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన మొక్కలను నాటాలి.. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ వోలు మరియు సంబంధిత అధికారులతో సంక్షేమ పథకాల అమలు, పీఎం కూసుమ్ పథకం, వేసవిలో నీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు మరియు ప్లాంటేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల దరఖాస్తుల ఆన్లైన్ లో ఇంకా నమోదు పూర్తి కానటువంటి గ్రామాల దరఖాస్తులను రేపు ఉదయం లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. చర్ల 23, దుమ్ముగూడెం 23, అశ్వాపురం 3, మణుగూరు లో 7 మరియు బూర్గంపాడు లో 1 దరఖాస్తులు ఆన్లైన్ చేయవలసి ఉందని వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లో కొత్తగా వచ్చిన 3403 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉపాధి హామీ పథకంలో 20 రోజుల పని దినాల కంటే ఎక్కువ ఉన్నవారిని గుర్తించాలన్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 31 తారీకు లోపు పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. అదేవిధంగా తప్పుగా బ్యాంక్ అకౌంట్ లో నమోదైనటువంటి 29 దరఖాస్తులను వెంటనే సరైన బ్యాంక్ అకౌంట్ నెంబర్లను నమోదు చేయాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులకు గ్రామ సభలు మరియు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత పట్టిక ద్వారా వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం ద్వారా అర్హులకు డిజిటల్ రేషన్ కార్డ్ మంజూరు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క దరఖాస్తును క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పీఎం కూసుమ్ పథకం అమలులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రతి మండలంలో సబ్ స్టేషన్ వివరాలను తాసిల్దారులకు తెలియజేయడం ద్వారా వారు ఆ సబ్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి. పీఎం కూసుమ్ పథకం క్రింద సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనకు నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుందని, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ స్థాపన చేయడం వలన 90 శాతం సబ్సిడీ వస్తుందని కలెక్టర్ తెలిపారు. 3 కోట్ల పెట్టుబడిలో 90 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ ద్వారా సంవత్సరానికి 50 లక్షల ఆదాయం మహిళా సమాఖ్య కు వస్తుందని తెలిపారు. ఏపీవోలు ఆసక్తి గల మహిళా సమాఖ్య సంఘాలను గుర్తించాలని తెలిపారు. ప్రతి మండలంలో ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ప్లాంట్ స్థాపనకు మన జిల్లాకు 150 ఎకరాల లక్ష్యం ఇచ్చిందని తెలిపారు. వేసవిలో నీటి కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా పంచాయతీ అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి లభ్యత, నీటి సరఫరా లో సమస్యలను గుర్తించి పది రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గుత్తి కోయిల ఆవాసాలను, గిరిజన గూడెం లను ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా వారికి త్రాగునీటి కొరత రాకుండా సోలార్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. హరితహారం లో నాటే మొక్కలు ప్లాంటేషన్ లక్ష్యాలు మరియు సాధించిన ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్ప, ముష్టి గింజలు, తంగేడు, మునగ, సుబాబులు, సిస్సు ,టకొమో మరియు మందారం తదితర మొక్కలను నాటడం ద్వారా గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్లాంటేషన్ లో ఎదిగిన మొక్కలను వెంటనే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో నాటాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పిడి హౌసింగ్ శంకర్, జిఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య, ఎల్ డి ఎం రామిరెడ్డి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి,సెర్ప్ పిడి నీలేష్, అడిషనల్ డిఆర్డిఓ రవి మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: