తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం లో గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ 133 వ జయంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఎస్ ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు. మాట్లాడుతూ గ్రంథాలయంలో వర్గీకరణ సిద్ధాంతమును ప్రవేశపెట్టి పుస్తకాల వర్గీకరణ సులువు తరం చేశారని కొనియాడారు. ఆయన సేవ మరువలేనిదని విద్యార్థిని విద్యార్థులు పాఠకులకు వివరించారు. ఈ సందర్భంగా గ్రంధా పాలకులు గ్రంథాలయాలకి ఎనలేని సేవ చేస్తున్నారని వారి సేవల వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. వారు అమూల్యమైన సమయాన్ని గ్రంథాలయాల కోసం కేటాయిస్తున్నారని వారి సేవలు మరువలేనివని ఈ సందర్భంగా గ్రంథాలయంలో పనిచేసిన గ్రంథ పాలకులను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం. నవీన్ కుమార్ , గ్రంధపాలకురాలు జి. మణి మృదుల విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ