Wednesday, 15 April 2026 06:38:23 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

రేపు అశ్వరావుపేటలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బయోచార్‌పై ఉచిత శిక్షణ : జిల్లా కలెక్టర్

Date : 06 January 2026 06:04 PM Views : 218

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు సువర్ణ అవకాశం. జిల్లాలోని రైతులకు ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బయోచార్ నిపుణులు పరశురాం కైలాస్ అఖరే గారి ఆధ్వర్యంలో బయోచార్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించబడనుండగా, మొదటి రోజు HNTC, గరిమెళ్ళపాడు లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమం రేపు (07-01-2026) బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బయోచార్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు, మట్టిసారాన్ని పెంపొందించడంలో బయోచార్ పాత్ర, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, పంట దిగుబడులు పెంచడం వంటి అంశాలపై రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శిక్షణకు సంబంధించిన వివరాలు మరియు లొకేషన్ సమాచారం కోసం క్రింది వారిని సంప్రదించవచ్చని తెలిపారు. శిక్షణ వివరాలకు సంప్రదించవలసిన వారు : రాజు – 92814 79565 (DRDO కార్యాలయం) డా. నాగ అంజలి – 94927 31222 అగ్రికల్చర్ కాలేజ్, అశ్వరావుపేట

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :