తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్):23, కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్ లోని నెహ్రూ బస్తి ప్రజల ఆధ్వర్యంలో ఆ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లను ఘనముగా సన్మానించారు. ఆదివారం నెహ్రూ బస్తి ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ ఈ డివిజన్ ప్రజల ఆదరాభిమానాలను, నెహ్రూ బస్తి ప్రజల ఆత్మీయతకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అన్నారు. ధన బలము కంటే, ప్రజా బలమే గొప్పదని గత మూడు పర్యాయాలు డివిజన్ ప్రజలు మాకు విజయాన్ని అందించి నిరూపించారని అన్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నని ఆమె ఉద్వేగ భరితంగా మాట్లాడారు. గెలుపు,సన్మానాలు అనేటివి ప్రజల్లో ఇంకా మా బాధ్యతను పెంచుతాయని ఆమె అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల సాధనలో మా వంతు ప్రయత్నం చేసి ఈ డివిజన్ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజల ఆశయాలకు, ఆకాంక్షకు కట్టుబడి మా బాధ్యతలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్ భార్యాభర్తల ప్రతిమతో కూడిన కేకును ముద్రించి కట్ చేయించి బస్తివాసులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో బస్తీ పెద్దలు సావిత్రమ్మ, సుమిత్ర ,గాయత్రి ,సరోజ, మేరక్క ,బేబీ, బత్తుల పద్మ ,శ్రీలక్ష్మి ,లావణ్య, మాణిక్యమ్మ, శాంత, సింధు, నాయకులు ఓం నారాయణ, గంగరాజు, తీట్ల దివాకర్, గడిదాసు కుమార్, సుధాకర్, రాజేష్ ,మండేలా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ