Sunday, 19 April 2026 03:19:11 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

- వారోత్సవాల పేరిట పిల్లల సృజనాత్మక శక్తికి వెలికితీయడం అభినందనీయం : ఎంఎల్ఎ కూనంనేని

Date : 20 November 2024 06:37 PM Views : 556

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారలని, ప్రత్యక్ష దేవాలయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. గ్రంధాలయ వారోత్సవల ముంగింపు సందర్భంగా కొత్తగూడెం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కూనంనేని మాట్లాడుతూ 57వ జాతీయగ్రంధాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వారోత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులకు పలు రకాల పోటీలు నిర్వహించారని, ఆ పోటీల్లో పిల్లలు సంతోషంతో పాల్గొన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పిల్లలో దాగుతున్న సృజనాత్మక శక్తియుక్తులను వెలికి తీసేందుకు ఇలాంటి వేధికలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని, విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా వారు ఉత్సాహంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తారని చెప్పారు. ఆటపాటలతో హాయిగా సాగిపోయే బాల్య మస్తిష్కంలో ఎన్నో ఆలోచలు దాగుంటాయని, వాటిని మెరుగుపరుచుకునేందుకు వేధికలు దొరికితే అంతకు మించిన ఆనందం ఉండదన్నారు. పిల్లలు కూడా నిత్యం వుస్తక పఠనంతో పాటు పత్రికలను చదవడం అలవర్చుకోవాలని, దేశంలో, రాష్ట్రంలో, మన చుట్టు ప్రక్కల ఏమి జరుగుతుందో తెలుసుకోవడం వల్ల మరింత ఆలోచనా శక్తి పెరుగుతుందని చెప్పారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులు గ్రంధాలయాలకు వచ్చి మంచిమంచి పుస్తకాలు చదువుకుని తెలివితేటలు పెంచుకోవాలని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, బాల్యంలో చక్కగా చదువుకుని పైకి రావాలని, మనిషి జీవన శైలిని మార్చగల శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉందన్నారు. కష్టపడి చదువుకున్న వాళ్లు నేడు ఎంతో సంతోష కరమైన జీవితాలను గడువుతున్నారని, వారి బ్రతుకులు బంగారు మయంగా ఉన్నాయన్నారు. ఇక్కడికి వచ్చిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, నా బాల్య జీవితం ఒక్క సారిగా కళ్లముందు కదలాడిందన్నారు. నూతనంగా నిర్మించుకున్న గ్రంధాలయాన్ని త్వరలో సరి కొత్త హంగులతో ప్రారంభించుకుని పాఠకులకు అందుబాటులోనికి తీసుకొస్తామని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ గ్రంధాలయంపై ఆధారపడి చదివిన ఎందరో అభ్యర్థులు ఉద్యోగాలు సాధించినట్లు తెలిసిందని అనునిత్యం అభ్యర్ధులకు అందుబాటులో ఉంటూ వారు చదువుకుని ఉద్యోగాలు సాధించేందుకు సిబ్బంది కృషి చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం వారం రోజుల పాటు నిర్వహించిన పలు సాంస్కృతి, వైజ్ఞానికి కార్యక్రమాల్లో ప్రతిభను కనబరిచిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కావు సీతామహాలక్ష్మీ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, గ్రంథాలయ కార్యదర్శి వి అర్జున్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్కే దస్తగిరి, వివేకవర్ధిని ప్రిన్సిపాల్ మహేష్, హెచ్ఎం నీరజ, గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్, గ్రంథ పాలకులు మణి మృదుల, మధుబాబు,రుక్మిణి గీత, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :