తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం న్యాయమూర్తులుగా నియమితులైన కుమారి కాటూరి బిందు, కుమారి గుగులోతు గిరిజ నాయక్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వసంత్ మాట్లాడుతూ, కష్టపడి చదువుకుని జీవితంలో ఎదగడం సాధ్యమని, శ్రమిస్తే విజయఫలితాలు తప్పక వస్తాయని, ఈ ఇద్దరు న్యాయమూర్తులు దానికి మిన్నైన ఉదాహరణ అని అభినందనలు తెలిపారు. అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో సమానంగా ముందుకు రావడం హర్షణీయమని, ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా నియమితులవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కే. కవిత, జూనియర్ సివిల్ జడ్జి కే. సాయి శ్రీ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జై గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు కాసాని రమేష్, కే. చిన్నికృష్ణ, అడపాల మహాలక్ష్మి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ