తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిస్వార్థ సేవే లక్ష్యం గా,పర్యావరణ పరిరక్షణ,సమాజ హిత కార్యాచరణ తో పని చేస్తున్న ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ISGF) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా లోగాని శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు.ఆదివారం రాత్రి వరకూ కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని సింగరేణి చిల్డ్రన్స్ పార్కులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG) సింగరేణి కార్యాలయం లో ISGF తెలంగాణ రాష్ట్ర సమ్మేళనం జరిగింది.సింగరేణి జీఎం వెల్ఫేర్ GV.కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ISGF జాతీయ అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్) మ్యాక్ మిక్కి ప్రధాన పర్యవేక్షకుడుగా పాల్గొని మాట్లాడారు.భద్రాద్రి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగానిశ్రీనివాస్ పేరును మిక్కి ప్రతి పాదించగా,SGF నూతన జిల్లా అధ్యక్షుడు గా, ప్రధాన కార్యదర్శి లుగా ప్రమాణ స్వీకారం చేసి పత్స రామకృష్ణా రావు,చిట్టిమళ్ళ శ్వేతా బ్రహ్మంచారి బలపర్చగా,అందరూ ఆమోదం తెలిపారు.SGF రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు జాతీయ అధ్యక్షులు మ్యాక్ మిక్కి ప్రకటించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ