తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చుంచుపల్లి : రాంనగర్లో అసంపూర్తిగా నిర్మించిన టీఎన్జీవో భవన నిర్మాణాన్ని బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా సందర్శించారు. జనావాసాల మధ్య భవన నిర్మాణాన్ని ప్రారంభించి వదిలేయడంతో అక్కడ వర్షపు నీరు చేరి దోమలు పెరిగాయని చెప్పారు. భవన నిర్మాణం కోసం గుంటలు తవ్వి వదిలేయడం సరి కాదని, వెంటనే భవన నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలని టీఎన్జీవో నాయకులను కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ