Sunday, 19 April 2026 02:18:51 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కార్మికులు వారి కుటుంబాలు ఆరోగ్యం గా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యం అవుతుంది. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలి

Date : 23 October 2025 07:42 PM Views : 862

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు, గోదావరిఖని ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.ఏడు నెలలుగా నిలిచి పోయిన మెడికల్ బోర్డు ను వెంటనే నిర్వహించాలి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను కోరిన గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్.సింగరేణి లో కార్మికులు వారి కుటుంబాలు ఆరోగ్యం గా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యం అవుతుందని, నిర్లక్ష్యం గా వ్యవహరిస్తె సంస్థ మనుగడకు ప్రమాదమని, కార్మికులకు, వారి కుటుంబాలకు, రిటైర్డ్ ఉద్యోగులకు సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ ను కోరారు. గురువారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి ని సందర్శించి అనంతం సి.ఎం.ఓ తో సింగరేణి లో ఉన్న ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిణామాల పై మాట్లాడారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందక కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని, వెంటనే యాజమాన్యం అన్ని రకాల మెడిసిన్స్ తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరిఖని, మణుగూరు లో జరిగిన సంఘటన లకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి ప్రధాన ఆసుపత్రి తో పాటు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ లను, గైనకాలజిస్ట్ లను, పిల్లల డాక్టర్ లను, రేడియాలజిస్టలను, టెక్నీషియన్స్ లను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రోగ నిర్దారణ చేసే పరికరాలైన బి.పి మిషన్లు, ఈ.సి.జి, టూడి ఏకో, స్కానింగ్, సి.టి మరియు ఎం.ఆర్.ఐ మిషను లను అందుబాటులో ఉంచాలని, కొన్ని ఏరియా హాస్పిటల్ లో విలువైన వైద్య పరికరాలు ఉన్నా వాటిని నిర్వహించేందుకు సరైన టెక్నిషియన్స్, రేడియాలజిస్టులు లేక లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాలు మూలన పడి ఉన్నాయని, ముఖ్యంగా గోదావరిఖని లో ఈ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్యం విషయంలో యాజమాన్యం రాజీ పడకుండా అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్స్ కు పంపించి మైరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, చాలా మంది కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురవడం వల్ల వారు విధులు నిర్వహించక అనేక అవస్థలు పడుతున్నారని వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్ లు దురుసుగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి దాహాంతో కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బ తీయొద్దని, వారు ఆరోగ్యంగా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ తో పాటు తదితరులు ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :