తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 19 తెలుగు వెలుగు) అద్భుతమైన అంతరిక్ష పరిశోధన యాత్రను విజయవంతంగా ముగించుకొని 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకున్న సునీతా విలియమ్స్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ..... జూలూరుపాడు ప్రెస్ క్లబ్" సీనియర్స్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బాణసంచా పేల్చి జయహో సునీత విలియమ్స్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు, అనంతరం ,ప్రెస్ క్లబ్ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భాదవత్ రవి, హెడ్ కానిస్టేబుల్ దయానంద్, సిబ్బంది వెంకట్, కృష్ణ మరియు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు షేక్ జానీ,తంబర్ల పుల్లారావు, చపాలమడుగు నర్శింహారావు, షేక్ భుడెన్ పాషా,ఉసికల రమేష్,సబ్బత్తి శివమూర్తి,కొలిపాక చంద్రశేఖర్, పెండ్యాల విజయ భాస్కర్,నలగట్ల దిలిప్, కసిమల్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ