Friday, 19 June 2026 02:58:14 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ప్రోగ్రాం ఆఫీసర్లతో మరియుఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్

Date : 15 June 2026 05:46 PM Views : 38

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కార్యాలయం నందు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో పునఃశ్చరణ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పల్స్ పోలియో ఈనెల 28న ఉన్నందున దానికి సంబంధించిన సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా మొదటి రోజు బూత్ ఆక్టివిటీ రెండవ రోజు మరియు మూడవ రోజుగృహ సందర్శనలు చేయడం గురించి చర్చించడం జరిగినది. ఈ నెల 19న వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సికిల్ సెల్ ఎనీమియా మరియు తలసీమియా, రక్త కణ లోపాలు ఉన్న వారిని గుర్తించి స్క్రీనింగ్ చేయుట మరియు క్యాంపులు నిర్వహించడం గురించి మాట్లాడడం జరిగినది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత ఉన్నందున వాటిని అధిగమించడానికి ఒక పటిష్ట ప్రణాళికను తయారు చేయుట గురించి వివరించడం జరిగినది..డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డా. తుకారాం రాథోడ్ జిల్లా ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిర్వహణ, నిల్వ, పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు (Expired Drugs), వినియోగానికి అనర్హమైన మందుల రికార్డులు, డిస్కార్డ్ చేసిన మందుల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వ్యాక్సిన్లు మరియు ఫార్మసీ మందుల కోసం ప్రత్యేక స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలని, వేగంగా వినియోగమయ్యే (Fast Moving) మరియు తక్కువగా వినియోగమయ్యే (Slow Moving) మందులపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేపట్టి అవసరమైన మేరకు నిల్వలను నిర్వహించాలని సూచించారు. రోగనిరోధక టీకాల కార్యక్రమంలో ఉపయోగించే వ్యాక్సిన్లను నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడంతో పాటు కోల్డ్ చైన్ నిర్వహణను కచ్చితంగా పాటించాలని తెలిపారు. వ్యాక్సిన్ల నాణ్యతను కాపాడేందుకు కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. అలాగే మందుల కొనుగోలు, స్వీకరణ, పంపిణీ, నిల్వలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఈ-ఔషధి (e-Aushadhi) పోర్టల్ లో సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఫార్మసీ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్వో కొత్తగూడెం డాక్టర్ సాయి కళ్యాణ్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ప్రతాప్ ,డాక్టర్ దినేష్, డాక్టర్ రాకేష్, డాక్టర్ హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి ,డిపిఎమ్ఓ మోహన్, సిహెచ్ఓ నాగభూషణం, జిల్లా ఫార్మసీ అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :