తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు అనగా 02-06-2026న కొత్తగూడెంలోని పీఎం బ్రదర్స్ హాస్పిటల్ పై పత్రికలో ప్రచురితమైన వార్తల నేపథ్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించడం జరిగింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. రాందాస్ ఆధ్వర్యంలో సంబంధిత ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టి, పత్రికలో ప్రచురితమైన అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించారు. విచారణకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి, అలాగే జిల్లా కలెక్టర్ కి త్వరలో సమర్పించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ హరీష్ డాక్టర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ